జయలలిత ‘హిందుత్వ నాయకురాలు.. అజ్ఞానం బయటపడిందంటూ శశికళ కౌంటర్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత హిందుత్వ వాది అంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు వీకే శశికళ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-05-25 16:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మాజీ సీఎం జయలలిత హిందుత్వ వాది అంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు వీకే శశికళ కౌంటర్ ఇచ్చారు.అన్నామలై వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.అందరూ ఒక్కటే అనేది అన్నాడీఎంకే సిద్ధాంతమని.. దాన్నే అమ్మ పాటించారన్నారు. హిందుత్వవాదిగా ప్రధాని మోడీ కనిపిస్తున్నారే తప్ప.. జయలలిత అలా ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించలేదని శశికళ స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత అన్నామలై తమ పార్టీ (అన్నా డీఎంకే)లో చేరాలని భావిస్తే స్వాగతం పలుకుతామన్నారు. ‘‘జయలలిత జీవించి ఉన్నంత వరకు తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. ఆమె తన హిందుత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’’ అని అన్నామలై ఇటీవల కామెంట్ చేశారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను శశికళ ఖండించారు.

Similar News