సందేహాలను సృష్టించే ప్రయత్నం.. అన్ని వివరాలు బయటపెడతాం: సీఈసీ

బూత్‌ల వారీగా ఓటరు వివరాలను అందించడానికి ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.

Update: 2024-05-25 12:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బూత్‌ల వారీగా ఓటరు వివరాలను అందించడానికి ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై శనివారం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తులు నిజాన్ని అంగీకరించారు. సందేహాస్పద వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. మేము ఒక రోజు కచ్చితంగా దీని గురించి అందరితో చర్చిస్తామని సీఈసీ అన్నారు. దేశ ఎన్నికల సమగ్రతకు సంబంధించిన ప్రక్రియపై అనుమానాలు రావడంపై ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల నిబద్దతను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈవీఎంలు సరిగా పని చేయకపోవడం, ఓటింగ్ లిస్ట్ తప్పుగా ఉండటం లేదా ఓటింగ్ నంబర్లు తారుమారు అయ్యి ఉండవచ్చనే సందేహాలు ప్రజల మనస్సుల్లో తలెత్తుతున్నాయి. అయితే ఈ సందేహాలు వారికి ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నారు? ఏం నాటకం జరుగుతుంది? వీటన్నింటి గురించి సుప్రీంకోర్టు నిన్న సమాధానం ఇచ్చింది, కానీ మేము కూడా మా సమాధానం ఇస్తాము, కచ్చితంగా వీటి గురించి అన్ని వివరాలు బయటపెడతాం అని రాజీవ్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్ డేటాను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా ఈసీని ఆదేశించాలన్న NGO అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News