మత ప్రాతిపదిక రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన ప్రకటన

మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించబోమని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Update: 2023-05-06 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించబోమని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం అథనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లింలకు రిజర్వేషన్ కోటాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. అందుకే మత ప్రాతిపదికన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని, అందుకే గుజరాత్‌లో ఎన్ని హామీలు ఇచ్చినా ఆ పార్టీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. అటు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారని అమిత్ షా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రజలు అంగీకరించరని చెప్పారు. మోదీ ఇచ్చిన హామీలనే ప్రజలు నమ్ముతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Read More:   ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలే: MP ఉత్తమ్ ఫైర్

మణిపూర్ తగలబడుతుంటే.. ప్రధాని సినిమాను ప్రమోట్ చేస్తున్నారు: ఒవైసీ

Tags:    

Similar News