నలుగురి ప్రాణాల మీదకు తెచ్చిన గూగుల్ మ్యాప్.. కారుతో సహా కాలువలోకి

ఈ రోజుల్లో దేశంలోని ప్రతి ఒక్కరు తమకు తెలియిని మారుమూల ప్రాంతాలకు సైతం గూగుల్ మ్యాప్ సహాయంతో చేరుకుంటున్నారు.

Update: 2024-05-25 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో దేశంలోని ప్రతి ఒక్కరు తమకు తెలియిని మారుమూల ప్రాంతాలకు సైతం గూగుల్ మ్యాప్ సహాయంతో చేరుకుంటున్నారు. కొంతమందికి ఈ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతుండగా.. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రయాణికులు ప్రాణాల మీదకు తీసుకు వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి కేరళలలో హైదరాబాద్ వాసులకు జరిగింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న నలుగురు యాత్రికులు.. కారుతో సహా కాలువలోకి దూసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కి చెందిన నలుగురు విహార యాత్ర కోసం కేరళలోని అలిప్పీకి కారులో వెళ్లారు. తెల్లవారుజామున గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తుండగా రోడ్ పై నుండి ఒక కాల్వలోకి దూసుకెళ్లారు. ఒక వ్యక్తి చాకచక్యంగా తప్పించుకుని బయటికి వచ్చి స్థానికులను సహాయం కోరగా.. మిగతా ముగ్గురిని కూడా వెంటనే మునిగిపోతున్న కారు నుండి బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా కాలువ పొంగిందని.. అలాగే ఈ ప్రాంతం గురించి వాళ్లకి తెలియక పోవడం, రాత్రికి రాత్రే వారుల వెళ్లవలసిన మార్గంలో భారీగా నీరు వచ్చి చేరడం వల్ల గూగుల్ మ్యాప్స్ వారిని తప్పుదారి పట్టించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Similar News