ప్రేమతో పెట్టిన ముద్దు.. ఆసుపత్రిలో చేరిన వరుడు.. అసలేమైదంటే?

ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పెళ్లి అంటే బంధువులు, వేద మంత్రాల సాక్షిగా వరుడు, వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు. అయితే ఈ పెళ్లి మండపంలో చిన్న చిన్న సరసాల సన్నివేశాలు

Update: 2024-05-24 02:54 GMT

దిశ, ఫీచర్స్ : ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పెళ్లి అంటే బంధువులు, వేద మంత్రాల సాక్షిగా వరుడు, వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు. అయితే ఈ పెళ్లి మండపంలో చిన్న చిన్న సరసాల సన్నివేశాలు జరగడం కామన్. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని అశోక్ నగర్‌లో ఓ కళ్యాణ మండపంలో జరిగిన వివాహంలో వరుడు ప్రేమతో చేసిన పనికి ఆయన ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది.

అసలు విషయంలోకి వెళితే.. ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లకు ఒకేసారి పెళ్లి నిశ్చయం చేశాడు. ఇక ఉదయం తన పెద్ద కూతురు వివాహం ఘనంగా జరిపించాడు. ఇక రెండో కూతురి వివాహానికి వచ్చేసరికి సమస్య మొదలైంది. అయితే మండపంలో వధూవరులు దండలు మార్చుకునే క్రమంలో వరుడు, వధువుకు ముద్దు పెట్టాడు. దీంతో అది చూసి షాకైన పెళ్లికూతురు తరఫున బంధువులు వరుడితో అతని ఫ్యామిలీతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త చేతల వరకు వెళ్లింది. చివరికి పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వచ్చి వారి మధ్య గొడవను సద్దుమణిగేలా చేశారు. అయితే దీంతో వధువు తరఫున వారు మాట్లాడుతూ.. మండపంలో వధువును ముద్దు పెట్టుకోవడం తప్పు అంటూ చెప్పుకొచ్చారు. దాని గురించి పోలీసులు వరుడి ప్రశ్నించగా.. కాబోయే భార్య అని ప్రేమతో పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పి వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే దాడిలో పెళ్లికొడుకుతో పాటు పలువురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి చేర్చారు. ఇక ఈ సంఘటనతో పెళ్లి రద్ధు అయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Similar News