ఈ బేకరీలో అనాధలకు కేకులు ఉచితం!
0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కేక్ ఉచితం. Bakery offering free cakes to orphans.
దిశ, వెబ్‌డెస్క్ః వ్యాపారం అంటేనే లాభాపేక్షతో చేసే వ్యవహారం. చాలా మంది వ్యాపారులు ఆ లాభం కోసం ఎంత మోసానికైనా ఒడిగడతారు. అయితే, ఈ కాలంలో నిజాయితీగా, మానవత్వంతో ఉండే వ్యాపారులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాటిలో ఈ బేకరీ ఒకటి. అనాథలకు ఉచితంగా కేక్‌లను అందిస్తున్న ఈ బేకరీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్‌ను బట్టి, సదరు బేకరీ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఉంది. ట్వీట్లో కనిపించే బేకరీ డిస్ప్లే కౌంటర్లో ఉంచిన అనేక కేక్‌లతో పాటు అక్కడున్న గ్లాస్ బాక్స్‌కు ఒక నోట్ చూడొచ్చు. "ఉచితం! ఉచితం! ఉచితం! తల్లి గానీ, తండ్రి గానీ లేని 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కేక్ ఉచితం" అని అందులో రాసుంది. ఇప్పుడు బేకరీ యజమాని ఉదారతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
Love and Respect for the Shop Owner.❤️ pic.twitter.com/aNcSfttPrV
— Awanish Sharan (@AwanishSharan) August 12, 2022