గేమింగ్ జోన్‌లో మృత్యుక్రీడ.. ఘోర అగ్నిప్రమాదానికి 24 మంది బలి

గుజరాత్‌లోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 24 మంది చనిపోయారు.

Update: 2024-05-25 15:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగి 24 మంది చనిపోయారు. మృతుల్లో విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. చాలా మంది గేమింగ్ జోన్‌లో చిక్కుకుపోయారు. మంటలు అదుపులోకి వస్తున్న కొద్దీ సజీవ దహనం అయిన వారి మృతదేహాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలను వేగవంతంగా చేయాలని అధికారులను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని సూచించారు.

Similar News