ఆ పార్టీకి కఠిన పరిస్థితులు.. 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-17 14:59 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ఉత్కంఠగా జరగనున్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కలిసిపోతే, అప్పుడు అధికార పార్టీకి కఠిన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ కి ఈ ఎన్నికలు సులభతరం కావని అన్నారు.

బీజేపీతో పాటు జాతీయ పార్టీగా ఉన్నది కాంగ్రెస్ మాత్రమేనని, కొన్ని ప్రాంతాల్లో కాషాయ పార్టీ కన్నా తమకే బలమైన మద్దతు ఉందని చెప్పారు. కేరళ, తమిళనాడు లే దానికి ఉదాహరణ అని చెప్పారు. అవసరమైతే ప్రతిపక్షాలతో పొత్తుకు దిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే కూటమి విషయంలో తెలివిగా వ్యవహరించాల్సిన అవసరముందని అన్నారు.

ఎన్నికల ముందు పొత్తు కూడితే బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళిక బద్ధంగా సీట్ల కేటాయింపులు చేసుకోవాలని చెప్పారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు, భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌ను బలపరిచాయని సోనియాగాంధీ తనతో చెప్పిన విషయాన్ని థరూర్ గుర్తుచేశారు. జోడో యాత్ర రాహుల్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లిందని అన్నారు.

Also Read...

అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం.. 

Tags:    

Similar News