ఏఐఎల్‌ఈటీ దరఖాస్తు తుది గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐఎల్ఈటీ)-2020కి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆగస్టులో నిర్వహించే అవకాశమున్నదని వెల్లడించింది. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఎగ్జామ్ సెంటర్‌లను మార్చుకోవాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తుల దృష్ట్యా.. క్యాండిడేట్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ […]

Update: 2020-05-14 09:46 GMT

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐఎల్ఈటీ)-2020కి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆగస్టులో నిర్వహించే అవకాశమున్నదని వెల్లడించింది. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఎగ్జామ్ సెంటర్‌లను మార్చుకోవాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తుల దృష్ట్యా.. క్యాండిడేట్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ అప్లికేషన్ పత్రంలో స్వయంగా ఎగ్జామ్ సెంటర్‌లను మార్చే అవకాశమిచ్చేందుకు నిర్ణయించిందని పేర్కొంది. ఈ అవకాశాన్ని జూన్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. తర్వాత ఎగ్జామ్ సెంటర్‌ల మార్పును యూనివర్సిటీ అనుమతించబోదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News