గుంతలను పూడ్చిన ట్రాఫిక్ సీఐ

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆయన ఓ పోలీస్ అధికారి. నిత్యం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో తలమునకలై ఉంటూ.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్లగొండ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లు గుంతలు ఏర్పడ్డాయి. సామాజిక బాధ్యతంగా వాటిని పూడ్చారు. ఇంతకీ ఆ అధికారి ఎవరో కాదు.. నల్లగొండ ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్ కుమార్. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా […]

Update: 2020-08-19 07:21 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆయన ఓ పోలీస్ అధికారి. నిత్యం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో తలమునకలై ఉంటూ.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్లగొండ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లు గుంతలు ఏర్పడ్డాయి. సామాజిక బాధ్యతంగా వాటిని పూడ్చారు. ఇంతకీ ఆ అధికారి ఎవరో కాదు.. నల్లగొండ ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్ కుమార్. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లు గుంతలమయంగా మారాయి. దీంతో సీఐ తన సిబ్బందితో కలిసి గుంతలను పూడ్చి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.

Tags:    

Similar News