హెడ్ కానిస్టేబుల్ రఘు సస్పెన్షన్

దిశ ప్రతినిధి, నల్లగొండ: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఏ.వి.రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి రక్షణ కల్పించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు, ఇప్పటికే ప్రాథమిక విచారణ చేసి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘనటపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు […]

Update: 2020-07-26 09:09 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఏ.వి.రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి రక్షణ కల్పించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు, ఇప్పటికే ప్రాథమిక విచారణ చేసి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘనటపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు ఎస్పీ నర్మదను ఆదేశించారు. మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఎలాంటి సమస్య ఎదురైనా డయల్ 100 ద్వారా గానీ, తనకు గానీ, అదనపు ఎస్పీ నర్మదకు నేరుగా సమాచారం అందజేసిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News