ధోనీ, కోహ్లి, రోహిత్‌కు డోపింగ్ పరీక్షలు
దిశ, స్పోర్ట్స్: డ్రీమ్ 11 ఐపీఎల్ (IPL) సీజన్ 13లో పాల్గొనడానికి యూఏఈ (UAE) వెళ్లిన క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంఘం (నాడా) నిర్ణయించింది. ఇందుకు గాను ర్యాండమ్ పద్దతిలో పలువురు క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్దం చేసింది. 53రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ నిర్వహణ సమయంలోనే 50 మంది క్రికెటర్లకు పరీక్షలు చేయనున్నారు. ఈ 50 మందిలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రాయల్ […]
దిశ, స్పోర్ట్స్: డ్రీమ్ 11 ఐపీఎల్ (IPL) సీజన్ 13లో పాల్గొనడానికి యూఏఈ (UAE) వెళ్లిన క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంఘం (నాడా) నిర్ణయించింది. ఇందుకు గాను ర్యాండమ్ పద్దతిలో పలువురు క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్దం చేసింది. 53రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ నిర్వహణ సమయంలోనే 50 మంది క్రికెటర్లకు పరీక్షలు చేయనున్నారు. ఈ 50 మందిలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ కూడా ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ జరగనున్న దుబాయ్ (Dubai), షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఒక్కో చోట ఒక డోప్ నియంత్రణ కేంద్రాన్ని, ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్ క్రికెట్ స్టేడియాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల సాధనకు ముందుగానీ, సాధన తర్వాత గానీ, మ్యాచ్ విరామ సమయంలోగానీ ఎప్పుడైనా నాడా ఈ శాంపిళ్లను సేకరించనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఐపీఎల్‌లో పాల్గొనే క్రికెటర్ల మూత్రమే కాకుండా రక్త నమూనాలు కూడా సేకరించనున్నట్లు ఆయన తెలిపారు.