ఆలయాల పరిరక్షణకు… ముస్లిం సోదరి సంఘీభావం

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రథం అగ్నికి ఆహుతైన ఘటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుంబిగించారు. ఆలయాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ, ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని జనసైనికులతో పాటు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ పిలపునకు స్పందిస్తూ… దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై నిరసన తెలియజేసేందుకు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో హైందవులకు ముస్లిం […]

Update: 2020-09-12 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రథం అగ్నికి ఆహుతైన ఘటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుంబిగించారు. ఆలయాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ, ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని జనసైనికులతో పాటు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా పవన్ కళ్యాణ్ పిలపునకు స్పందిస్తూ… దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై నిరసన తెలియజేసేందుకు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో హైందవులకు ముస్లిం సోదరి షేక్ హాలీమా బీ సంఘీభావం తెలిపారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.

Tags:    

Similar News