MLC కవిత పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్..

దిశ, మల్యాల : ఎమ్మెల్సీగా మరోసారి మండలిలో అడుగుపెట్టిన కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనలో జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణికి ఘోర అవమానం జరిగింది. ఎమ్మెల్సీ కవితతో పాటు బోగ శ్రావణిని పోలీసు అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె కొద్దిసేపు అక్కడే ఉండి జగిత్యాలకు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఆమె మామ స్థానిక పోలీసుల తీరుపై […]

Update: 2021-11-27 10:07 GMT

దిశ, మల్యాల : ఎమ్మెల్సీగా మరోసారి మండలిలో అడుగుపెట్టిన కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనలో జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణికి ఘోర అవమానం జరిగింది. ఎమ్మెల్సీ కవితతో పాటు బోగ శ్రావణిని పోలీసు అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె కొద్దిసేపు అక్కడే ఉండి జగిత్యాలకు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఆమె మామ స్థానిక పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆడవాళ్లని కూడా చూడకుండా నెట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు.

అక్కడ ఓకే..

అయితే, కొండగట్టులో తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో అసహనం వ్యక్తం చేసిన శ్రావణి తిరిగి మధ్యాహ్నం జగిత్యాలలో కవితను కలిశారు. కొండగట్టులో కవితను కలిసేందుకు ఆమెకు బ్రేకు వేసినప్పటికీ.. జగిత్యాలలో మాత్రం శ్రావణిని అనుమతించారు.

Tags:    

Similar News