పార్లమెంట్ భవనంలోనే ఎంపీల రాసలీలలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశ చట్టాలను రూపొందించే పవిత్రమైన పార్లమెంట్ భవనం రాసలీలలకు నిలయంగా మారింది. కొందరు ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఘన ‘కార్యానికి’ పాల్పడ్డారు. రాసలీలలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోమవారం రాత్రి బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలోని ప్రేయర్ రూంలో కొంతమంది ఎంపీలతోపాటు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు లైంగిక కార్యక్రమాలకు తరుచూ వినియోగించుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఓ […]

Update: 2021-03-23 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ చట్టాలను రూపొందించే పవిత్రమైన పార్లమెంట్ భవనం రాసలీలలకు నిలయంగా మారింది. కొందరు ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఘన ‘కార్యానికి’ పాల్పడ్డారు. రాసలీలలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోమవారం రాత్రి బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలోని ప్రేయర్ రూంలో కొంతమంది ఎంపీలతోపాటు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు లైంగిక కార్యక్రమాలకు తరుచూ వినియోగించుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఓ విజిల్ బ్లోయర్ బయట పట్టారు. వెంటనే అవ్వి ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ ఆ ఘటనను ఖండించారు. లైంగిక చర్యలకు పాల్పడిన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గంటల వ్యవధిలోనే కొంతమందిని విధుల నుంచి తొలగించారు.

ఈ ఘటనపై ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.. “ఈ రాత్రి ప్రసారమైన కథనాలు అసహ్యకరమైనవి, అనారోగ్యకరమైనవి. ఇవి ఎంతమాత్రం క్షమించలేని చర్యలు. ప్రజా పరిపాలన జరిగే పవిత్రమైన చోట, ఇలాంటివి జరగడం నిజంగా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.” అని ప్రధాని పేర్కొన్నారు. వీటిపై వెంటనే స్పందించిన తన పరిపాలన విభాగం వీటికి పాల్పడిన ఉద్యోగులను విధులను నుంచి తొలిగించడం జరిగిందని పేర్కొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News