ఓరి దేవుడో సమంత అంత సంపాదిస్తుందా.. ఆమె ఆస్తి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇ

Update: 2024-05-01 04:15 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక మయోసైటీస్ తర్వాత సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ మధ్యే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సమంత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సందడి చేయనుంది. ఇక తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సమంత చేతిలో ఇప్పుడు సినిమాలు లేకపోయినా ఈ బ్యూటీ చాలానే సంపాదిస్తుందంట. ప్రస్తుతం సమంత పేరుపై 127 పైగా కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులకు ఆస్తి పెద్దగా ఏమీ లేదు, వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అలాంటిది ఇప్పుడు కోటీశ్వరురాలు అయిపోయింది. అంతే కాకుండా అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ ఒక్క రూపాయి కూడా భరణం డిమాండ్ చేయలేదు. అలాగే విడాకుల తర్వాత సమంత చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ. దీంతో అసలు సామ్ సినిమాలు కూడా చేయడం లేదు కానీ ఇంత ఆస్తి ఎలా సంపాదించిందనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే సమంత ఎక్కువగా బిజినెస్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. అంతే కాకుండా బ్రాండెడ్ ప్రొడక్ట్స్, అడ్వర్టైజ్ మెంట్స్, ప్రమోషన్స్ ఇలా వీటి ద్వారా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఆమె డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొన్నింటిలో ఈమె పెట్టుబడులు కూడా పెట్టిందంట. ఇక ఏది ఏమైనా రూ.500 లతో మొదలైన ఈమె జర్నీ ఏకంగా 127 కోట్ల వరకు వచ్చిదంటే, సమంత నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు కొందరు అభిమానులు.

Tags:    

Similar News