అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా..? యంగ్ హీరోయిన్‌కు షాకింగ్ ప్రశ్న.. ఆమె రియాక్షన్ ఏంటంటే!

యంగ్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ‘రాజా విక్రమార్క’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

Update: 2024-05-10 08:54 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ‘రాజా విక్రమార్క’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో జాన్విగా కనిపించి మెప్పించింది. ఇండస్ట్రీకి వచ్చిత అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘రసవతి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించిన తాన్యా రవిచంద్రన్.. తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు పంచుకుంది.

‘‘రసవతి’ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ మూవీ నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొస్తూ.. ఓ అభిమాని తనను అడిగిన ఓ షాకింగ్ ప్రశ్న గురించి తెలిపింది. ‘ఒక్కోసారి అభిమానుల నుంచి విచిత్రమైన ప్రశ్నలు ఎదురువవుతాయి. అలాంటి సమయంలో ఏం బదులు ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అతడు అడిగిన ప్రశ్న ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అక్కా ఏంటీ.. పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకుని.. ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాక నాలో నేనే నవ్వుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ రోజు రిలీజైన ‘రసవతి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటోందో వేచి చూడాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News