నన్ను ఇంత దారుణంగా అవమానిస్తారా.. దుమారం రేపుతున్న కరణ్ జోహార్ పోస్ట్

కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. డైరెక్టర్‌గా, నిర్మాతగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని రెండున్నర దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

Update: 2024-05-06 11:14 GMT

దిశ, సినిమా: కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. డైరెక్టర్‌గా, నిర్మాతగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని రెండున్నర దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోతో అందరినీ అలరించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కరణ్ జోహార్ గత కొద్ది కాలంగా నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తున్నాడు. తాజాగా, కరణ్ పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఓ కమెడియన్ తనను దారుణంగా అవమానించాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘ నేను మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. అప్పుడే ఓ పాపులర్ చానెల్‌లో రియాలిటీ కామెడీ షో ప్రోమో వచ్చింది. అందులో ఉన్న ఓ కమెడియన్ నన్ను చాలా దారుణంగా అవమానించాడు. ఇలాంటివి సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి వచ్చాయంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచి పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాగాలేదు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నన్ను ఇలా అవమానించడం బాధగా ఉంది. ఈ ప్రోమో చూశాక నాకు కోపం రాలేదు. కానీ చాలా బాధ కలిగింది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం కరణ్ జోహార్ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారికి మిస్టరీగా మారింది. ఆ కమెడియన్ ఎవరు అది ఏ షో అని నెట్టింట చర్చించుకుంటున్నారు.




 


Similar News