పవన్ కల్యాణ్‌లా ఎవరుంటారు.. అసెంబ్లీ ఎన్నికలతో రోజా చాప్టర్ క్లోజ్ అంటూ నటుడు సెన్సేషనల్ కామెంట్స్!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఎవరు అధికారం చేపట్టి సీఎం అవుతారనే దానిపై అందరి చూపు పడింది.

Update: 2024-05-23 13:13 GMT

దిశ, సినిమా: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఎవరు అధికారం చేపట్టి సీఎం అవుతారనే దానిపై అందరి చూపు పడింది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఏపీ ఎన్నికల గురించి స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివకృష్ణ ఏపీ పొలిటికల్ లీడర్స్‌పై షాకింగ్ చేశాడు. ‘‘తెలంగాణలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలో కూడా అదే వస్తుంది. కానీ మంత్రి రోజా, కొడాలి నాని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. ఎందుకంటే వేరే పార్టీ కనుక వాళ్లని తీసుకుంటే రాజకీయాల్లో ఉంటారు. లేదంటే రాజకీయ జీవితం ముగిసినట్టే’’ అని చెప్పుకొచ్చాడు.

అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో గెలిచేది పవన్ కల్యాణ్. 40 వేల నుంచి 50 వేల మెజారిటీతో ఆయన గెలుస్తాడు. ముఖ్యంగా ఆయన మాట తప్పని మనిషి. ఇప్పుడు పొత్తు రాజకీయ నాయకులు ఎవరు లేరు. పొత్తుకు ముందు ఏం చెప్పారో అదే చేశారు. పవన్ కల్యాణ్ కూడా చెప్పిన మాటలు నిజం చేస్తారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని వైఎస్ జగన్ ను ఓడించడం లక్ష్యమన్నారు. అన్నట్లుగానే సీట్లు కేటాయించినా కూడా సర్దుబాటులో ఐదు సీట్లను వదులుకున్నారు. అంతేకాకుండా అన్నయ్య నాగబాబుకు ఇచ్చిన ఎంపీ సీటును వదులుకున్నారు. అలా ఎవరుంటారు పవన్ కల్యాణ్ తప్ప. ఆయన చాలా మంచోడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాడు. గెలిస్తే కచ్చితంగా చేస్తాడు’’ అని అన్నాడు. ప్రస్తుతం శివ కామెంట్లు వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Similar News