ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ హిట్ మూవీ

Update: 2024-05-23 08:42 GMT

దిశ, సినిమా: కలర్ ఫోటో చిత్రంతో హీరోగా సుహాస్ తొలిసారిగా తెరపై కనిపించాడు. మొదటి సినిమాతోనే తన సహజమైన నటనతో అందర్ని ఆకట్టుకున్నాడు. ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కథకి ప్రాధాన్యత ఇస్తూ మంచి సినిమాలను ఎంచుకుంటాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ మూవీతో పెద్ద విజయాన్నిఅందుకున్నాడు.

ఇప్పుడు ప్రసన్న వదనంతో కూడా హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వం దర్శకుడు సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 3న విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కథానాయికలుగా నటించారు.

థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. ప్రముఖ ఓటీటీ (OTT ) ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఆహా సబ్ స్క్రైబర్స్ ఈ చిత్రాన్ని చూడలేరు. ఆహా గోల్డ్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రమే చూడగలరు. అధికారికంగా, ఈ చిత్రం మే 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

Similar News