టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వింత కోరిక.. మగాడిలా మారాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటుంది.

Update: 2024-05-26 14:30 GMT

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటుంది. ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘లియో’తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన దాదాపు రెండు దశాబ్దాలైనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తూ.. ప్రజెంట్ ‘విశ్వంభర, థగ్ లైఫ్, విదాముమార్చి’ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. 41 ఏళ్లు వచ్చిన స్టిల్ బ్యాచులర్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ తనకున్న వింత కోరికను బయటపెట్టింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తనకు ఒక్కరోజు అబ్బాయిలా మారాలని ఉందని చెప్పుకొచ్చింది. ఒక కుర్రాడిలా ఉండటం ఎలా ఉంటుంది.. అతని బాడీ, మానసిక స్థితి తెలుసుకోవాలని ఆశక్తి ఉందని తెలిపింది. గతంలో చెసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ కావడంతో.. ఇది నిజంగా విచిత్రంగా, విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Similar News