జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేస్తా: విశ్వక్ సేన్

ప్రతి హీరోకి తన అభిమాన హీరో ఉంటారు.

Update: 2024-05-25 02:46 GMT

దిశ, సినిమా: ప్రతి హీరోకి తన అభిమాన హీరో ఉంటారు. కొందరు తమ ఫేవరెట్ హీరో సినిమాని రీమేక్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. నార్మల్ మూవీ రీమేక్ చేసినా హిట్ అవ్వదు. బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ చేయాలంటే పెద్ద రిస్క్ తీసుకోవాలి. ఇక క్లాసిక్ సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిదని చాలా వరకు హీరోలు రీమేక్ లు చేయడానికి ఇష్టపడరు.

అయితే, తాజాగా విశ్వక్ సేన్ మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమాని రీమేక్ చేస్తా అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇప్పట్లో చేయకపోయినా.. ఫ్యూచర్లో అయినా చేసే అవకాశం ఉండొచ్చు కానీ ప్రస్తుతం గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నా విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సినిమాలలో రీమేక్ చేయాల్సి వస్తే మీరు ముందుగా ఏ సినిమాని ఎంచుకుంటారన్న యాంకర్ ప్రశ్నకి విశ్వక్ సేన్ కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ యంగ్ హీరో నా అల్లుడు సినిమా రీమేక్ చేస్తాను అని చెప్పేసారు.

Similar News