Viral Video: వామ్మో!.. నిప్పు లేకుండా ఫిష్ ఫ్రై చేసిన యువతి.. (వీడియో)

దేశంలోని పలు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మోస్తరు వర్షాలు కురుస్తున్న.. తీవ్రమైన ఎండ వేడి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Update: 2024-05-27 06:12 GMT

దిశ, ఫీచర్స్: దేశంలోని పలు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మోస్తరు వర్షాలు కురుస్తున్న.. తీవ్రమైన ఎండ వేడి గాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా చోట్ల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎండల తీవ్రతకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో సరిహద్దు సైనికుడు కాలిపోతున్న ఎడారిలో ఇసుక పై పాపడ్ కాల్చడం మనం చూశాం. ఇప్పుడు మళ్లీ అలాంటిదే మరో సీన్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

వీడియోలో భాగంగా బెంగాల్‌కు చెందిన ఒక యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రాయిపై నూనెతో కూడిన ఫ్రైయింగ్ పాన్‌ పెట్టింది. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో అప్పటికే మసాలా పెట్టి ఉంచిన చేపలు తెచ్చి వేసింది. ఆమె చేపలను బాణలిలో వేసి వేయించడం ప్రారంభించింది. విపరీతమైన ఎండ వేడి కారణంగా నిప్పు లేకుండానే ఆ నూనె దానికదే వేడిగా మారిందని, అందులో చేపను వేసి ఓ వైపు వేయించిన తర్వాత.. రెండో వైపు తిప్పింది. ఇలా చేపను మొత్తం నిమిషాల వ్యవధిలో ఫ్రై చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో.. ఎండలు మండిపోతున్నట్లున్నాయ్''.. అంటూ కొందరు, ''ఎండలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చూడలేదు''.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం 1.20లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Similar News