‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వేణు ఉడుగుల

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘భువన విజయమ్’.

Update: 2023-02-26 12:19 GMT

దిశ, సినిమా: సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్‌పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ఫస్ట్ లుక్‌ను తాజగా వేణు ఉడుగుల విడుదల చేశారు. ఇక పోస్టర్‌లో వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు సీరియస్ లుక్‌లో కనిపించడం సినిమాపై క్యూరీయాసిటీని పెంచేస్తుంది. శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News