" వీర సింహారెడ్డి ", " వాల్తేరు వీరయ్య "టికెట్స్ బుకింగ్ డేట్ ఫిక్స్ !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న " వాల్తేరు వీరయ్య " సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అయింది.

Update: 2022-12-26 08:44 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న " వాల్తేరు వీరయ్య " సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అయింది. ఇందులో ఊరమాస్ అవతారంలో చిరు కనిపిస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' కూడా సంక్రాంతికి విడుదల అవుతుండటంతో రెండు చిత్రాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజా అప్ డేట్ ఏమిటంటే.. 'వీర సింహారెడ్డి' చిత్రం జనవరి 12న రిలీజ్ కానుండగా.. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న విడుదలకానుంది. ఇక ఒకరోజు ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్ కానున్నాయి. దీంతో ఓవర్సీస్‌లో డిసెంబర్ 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కానున్నాయి.

ఇవి కూడా చదవండి : ఫ్యామిలీతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఎన్‌టీ‌ఆర్.. పిక్స్ వైరల్

Tags:    

Similar News