శ్రద్ధాదాస్‌ ప్రేమలో వరుణ్.. భార్యతో గొడవలు జరుగుతాయంటూ ఆసక్తికర కామెంట్స్!

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Update: 2024-05-26 06:12 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరో కాలేకపోయాడు. ఇక వరుణ్ పర్సనల్ విషయానికొస్తే.. నటి వితిక షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు కూడా వచ్చారు. కానీ కప్ గెలుచుకోలేకపోయారు. ఈ జంట సినిమాలను దూరమైనప్పటికీ అప్పుడప్పుడు పలు షోస్‌కు హాజరవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వితికా షేరు ఓ యూట్యూబ్ చానల్ పెట్టి వ్లాగ్స్ చేస్తుంది.

వరుణ్ తేజ్ మాత్రం నిండా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, రితూ చౌదరి దావత్ షోలో పాల్గొన్న వరుణ్ సందేశ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు తెలిపాడు. వితికలో నచ్చని విషయాలు ఏంటని అడగ్గా.. తను నా టవల్, బ్రష్ వాడుతుంది అది నాకు నచ్చదు. అలాగే కొన్ని విషయాల్లో మాకు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య వచ్చేవి అని అంటాడు. ఆ తర్వాత రితూ.. మీ ఇద్దరిలో ఎక్కువగా ఎవరు సంపాదిస్తారు అని చెప్పగా.. నేను సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాను. కానీ తనకు నెల నెల వస్తాయి అయినా ఇద్దరం సేమ్ సంపాదిస్తాము అని చెప్పుకొచ్చాడు.

అయితే రీతూ వరుణ్ సందేశ్‌ను మీరు శ్రద్దాదాస్‌తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి దానిలో ఎంత నిజం ఉంది అనగా.. వరుణ్ స్పందిస్తూ.. నాకు వితికతో పెళ్లి జరిగి 8 సంవత్సరాలు కావొస్తుంది. ఇప్పుడు అలాంటి వార్తల గురించి గుర్తు చేసి మా ఇద్దరికి గొడవలు పెట్టకండి. శ్రద్దాదాస్‌‌తో సినిమాలు చేసినందుకు అలాంటి పుకార్లు పుట్టించారు. ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి అని అన్నాడు. దీంతో నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. వీరిద్దరు ప్రేమించుకుని బ్రేకప్ చెప్పుకున్నారని అందుకే వరుణ్ పూర్తిగా తమ ప్రేమ వార్తలపై స్పందించలేదని అంటున్నారు.

Similar News