నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా?

మెగా కోడలు ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్టార్ హీరోయిన్‌మించి పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-05-22 13:31 GMT

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్టార్ హీరోయిన్‌మించి పాపులారిటీ సంపాదించుకుంది. ఏ సినిమా చేయక పోయినప్పటికీ ఆసక్తికర పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాసన కూడా వెంట వెళ్తుంది. వీరిద్దరు క్యూట్ కపుల్‌గా ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నారు. అయితే ఉపాసన, రామ్ చరణ్ పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పెట్టింది. వృత్తిపరమైన వ్యవహారాల కారణం ఒమన్ దేశానికి ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.

అయితే రామ్ చరణ్ షూటింగ్ అన్నింటికీ గ్యాప్ ఇచ్చి భార్య, కూతురు తో వెళ్లడం అందరినీ ఫిదా అయ్యేలా చేస్తుంది. అయితే ఉపాసన ఒమన్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘ చరణ్ నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను చేసే పనులకు సపోర్ట్‌గా నిలబడుతున్నావు. భర్తగానే క్లిన్ కారాకు తండ్రిగా బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్‌ను ప్రత్యేకంగా మార్చిన నీకు అలాగే మహిళామణులందరికీ స్పెషల్ థాంక్స్’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఉపాసన, రామ్ చరణ్‌లపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

Similar News