విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తమిళ నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-02-06 16:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ‘తమిళగ వెట్రి’ కజగం అనే పార్టీ సైతం పెట్టారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ వర్గాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి రావడంపై నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె విజయ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నారని, తన నటన ద్వారా ప్రజల మనసులు గెలిచారన్నారు. అలాగే తన ప్రజలకు సేవ చేయడంలో భాగంగా రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది చాలా మంచి నిర్ణయమని చెప్పారు. చాలా మంది సీఎంలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారేనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News