ప్రముఖ దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉపాసన.. వైరలవుతున్న న్యూస్!

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు గురించి చాలా మంది ఓపెన్‌గానే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వారు ఎదుర్కొన్న సమస్యలను ఈ మధ్య పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు.

Update: 2024-05-02 03:33 GMT

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు గురించి చాలా మంది ఓపెన్‌గానే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వారు ఎదుర్కొన్న సమస్యలను ఈ మధ్య పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ఇండస్ట్రీలో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యింది. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో తెలిపింది. ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా?

Read More..

చుట్టూ వేలాది మంది.. అందరూ చూస్తుండగానే ఆమె కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే.. 



 బాలీవుడ్ బ్యూటీ ఉపాసన సింగ్, ఈ బ్యూటీని అందరూ ముద్దుగా ఉపాసన అని పిలుచుకుంటారు. ఇక ఈమె 40 సంవత్సరాల క్రితం జుదాయి అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ నటికి వరుసగా ఆఫర్స్ వచ్చి, స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి, లైంగిక వేధింపుల గురించి తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ఓ డైరెక్టర్ నాకు అనిల్ కపూర్ సరసన అవకాశం కల్పిస్తానని చెప్పి, తనను హోటల్‌కు రమ్మనారని, ఈ రోజు పని ఉంది రేపు తప్పకుండా వస్తాను అని చెప్పడంతో ఆయన నేను కారు పంపిస్తానని చెప్పాడు. దీంతో నాకు ఆయన మనసులో ఏం ఉందో అర్థం అయ్యింది.. దీంతో అతన్ని మందలించాను, మా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, నన్ను చాలా బాధ పెట్టింది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను వారం రోజులు ఏడ్చుకుంటూ ఉన్నాను, అసలు బయటకు కూడా రాలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Similar News