Pawan Kalyan అభిమానులను నిరాశపరుస్తున్న 'Unstoppable'

ఆహా మీడియాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతోంది.

Update: 2023-01-03 07:50 GMT

దిశ, సినిమా : ఆహా మీడియాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతోంది. మొదటి సీజన్ ఎంతమంచి హిట్ అయిందో, సీజన్ 2 అంతకు మించిన అప్లాజ్ అందుకుంటోంది. ఇక మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ను డిసెంబర్ 27న పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేస్తారని చెప్పారు. కానీ అదే టైమ్‌లో థియేటర్స్, ఓటీటీలె రిలీజయ్ సినిమాల సంఖ్య అధికంగా ఉండటంతో..ఫిబ్రవరి నెలలో టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉందట ఆహా మీడియా టీమ్. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తోనే " అన్‌స్టాపబుల్ విత్ NBK " రెండవ సీజన్‌కు ముగింపు పడుతుంది. అందుకే ఈ లాస్ట్ ఎపిసోడ్‌ను రిలీజ్ చేసేందుకు, మంచి ప్లానింగ్‌తో ఉంది ఆహా టీమ్.

Read more:

నా వక్షోజాలను ఒక సరుకులాగా మార్చేశారు: నటి Chhavi Mittal ఎమోషనల్ పోస్ట్ 

Tags:    

Similar News