బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుందంటూ ఎమోషనల్ పోస్ట్

బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మామ, భర్త మంజునాథ్ తండ్రి హఠాన్మరణం చెందాడు.

Update: 2024-04-28 09:43 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మామ, భర్త మంజునాథ్ తండ్రి హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని తెలుపుతూ లాస్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. మిస్ యూ అంకుల్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మంజునాథ్ కూడా తన తండ్రిపై భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.

‘‘ మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మిస్ యూ నాన్న’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా తండ్రి తో దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. కానీ తండ్రి మృతికి కారణాలు తెలపలేదు. అలాగే కామెంట్ సెక్షన్‌ను కూడా ఆఫ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన చెందుతూ లాస్య, మంజునాథ్‌ దంపతులకు ధైర్యం చెబుతున్నారు.

Read More..

అలాంటి వ్యాధితో బాధపడుతున్నానంటూ.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ గీతూ రాయల్ 



 



 



Similar News