ప్రముఖ దర్శకుడి పరువు తీస్తున్న కోడలు..ఎంత చేస్తే ఏం లాభం.. ఆస్తిపైనే కన్ను..

పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ' హీరామండి ' తో రీసెంట్ గా సక్సెస్ అందుకున్నాడు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రాజెక్ట్ తో మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఇందులో సోనాక్షి సిన్హా

Update: 2024-05-21 08:28 GMT

దిశ, సినిమా: పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ' హీరామండి ' తో రీసెంట్ గా సక్సెస్ అందుకున్నాడు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రాజెక్ట్ తో మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఇందులో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా, అదితి రావు హైదరి, రిచా ఛద్దాతో పాటు ఆయన మేన కోడలు షర్మిన్ సెగల్ కూడా నటించింది. ఇందుకోసం 16 సార్లు ఆడిషన్ ఇచ్చానని చెప్పింది. కానీ ఒక్క సీన్ లో కూడా ఆమె నుంచి ఎక్స్ ప్రెషన్ లేకపోవడంతో ట్రోలింగ్ మొదలైంది. కనీసం ఇంటర్వ్యూలలో కూడా ఆమె మాట్లాడేటప్పుడు ఎలాంటి ఎమోషన్ లేకుండా ఉండటం మరిన్ని విమర్శలకు గురయ్యేలా చేస్తుంది.

కాగా షర్మిన్ మాట్లాడుతున్నప్పుడు తోటి హీరోయిన్లు సెటైర్స్ వేయడం కూడా డైరెక్టర్ ను అవమానించినట్లు ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఒక సీన్ చేస్తున్నప్పుడు ముందు ప్రిపేర్ కావడం మంచిదని, కనీసం స్క్రిప్ట్, డైలాగ్స్ అయినా నేర్చుకుని సెట్ కు వస్తే బాగుంటుందని, కొంచెం యాక్టింగ్ చేస్తే ఇంకా బాగుండేదని కామెంట్ చేయడం షర్మిన్ తో పాటు భన్సాలీని కూడా తిట్టినట్లే అవుతుందని బాధపడుతున్నారు. ఇదంతా ఆమె వల్లే జరిగిందని.. ప్రముఖ దర్శకుడి కోడలుగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండాలని, అసలు ఆమెకు అవకాశం ఇవ్వడమే ఆయన చేసిన తప్పని అంటున్నారు నెటిజన్లు. ఇక ఆమెకు షూటింగ్ టైంలోనే పెళ్లి కాగా రూ. 1500 కోట్ల ఆస్తి ఉన్న బిజినెస్ మ్యాన్ ను చేసుకుంది. దీంతో ఈమెకు భర్త ఆస్తిపై ఉన్న శ్రద్ధ నటనపై లేదని కామెంట్ చేస్తున్నారు.

Similar News