కమల్‌-మణిరత్నం మూవీలో హీరోయిన్‌గా త్రిష?

రెండు దశాబ్దాలకుపైగా స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది త్రిష.

Update: 2023-09-13 09:27 GMT

దిశ, సినిమా: రెండు దశాబ్దాలకుపైగా స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది త్రిష. మాములుగా హీరోయిన్ల కెరీర్‌ కొంత కాలమే ఉంటుందని అంటుంటారు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా వయసు పెరిగేకొద్ది బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరిస్తుంది. స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రల్లో నటిస్తోంది. కాగా మరో సీనియర్ హీరోతో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కమల్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం స్క్రీప్టు పనులు జరుగుతున్న ఈ మూవీలో దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు తెలుగు నుంచి ఒకరిద్దరు స్టార్‌ హీరోలు కమల్‌ చిత్రంలో అతిథులుగా కనిపించే ఛాన్స్‌ ఉందట. ఇక ఈ సినిమాలోనే కమల్ జోడిగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read More:   Jawan OTT: రికార్డు స్థాయిలో ‘జవాన్’ ఓటీటీ రైట్స్.. ఏకంగా రెండింట్లో స్ట్రీమింగ్ 

Tags:    

Similar News