చంద్రకాంత్ అందుకే చనిపోయాడు.. పవిత్ర వల్ల! నేను కూడా అలాగే: నరేష్ సంచలన కామెంట్స్

జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయణి సీరియన్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-05-23 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయణి సీరియన్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని తోటి నటుడు అండ్ ప్రియుడు చంద్రకాంత్ కొన్ని రోజులకే సూసైడ్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సీనియర్ నటుడు స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మన ఆత్మీయులు మనల్ని అకస్మాత్తుగా విడిచి వెళ్లిపోతే ఆ బాధను భరించలేమన్నారు. ఆ టైంలో ఓదార్చేవారు, మనకు ధైర్యం చెప్పేవారు తప్పనికుండా పక్కనుండాలని తెలిపారు. తాను కూడా అలాంటి సంఘటన ఎదుర్కొన్నానని, అమ్మ విజయనిర్మల చనిపోయినప్పుడు నా లైఫ్ శూన్యమనిపించిందని, అప్పుడు కృష్ణ, నేను ఎంతో బాధపడ్డామని, మేం ఒకరికొకరం ఓదార్చుకున్నామని వెల్లడించారు. పవిత్ర జయరాం మరణించడంతో చంద్రకాంత్ కు ఒంటరిగా అనిపించిందని, దీంతో ఆయన కుమిలిపోయాడని అన్నారు. అదే చంద్రకాంత్ ను ఆత్మహత్య వైపు ఉసిగొల్పి ఉంటుందని వెల్లడించారు. ఆ సమయంలో చంద్రకాంత్ పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఉంటే ఆయనకు కాస్త ధైర్యంగా ఉండేది.. ఇలా జరగకపోయేదని నరేష్ చెప్పుకొచ్చారు. 

Similar News