డ్రగ్స్ కేసులో పాజిటివ్.. భయపడేదే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి హేమ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రేవు పార్టీ ఇష్యూ అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తాను రేవ్ పార్టీలో లేను అని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. హైదరబాద్‌లో తాను బిర్యానీ చేస్తున్న

Update: 2024-05-23 09:04 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం టాలీవుడ్‌లో రేవు పార్టీ ఇష్యూ అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తాను రేవ్ పార్టీలో లేను అని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. హైదరబాద్‌లో తాను బిర్యానీ చేస్తున్న వీడియోను విడుదల చేసింది. దీంతో దీనిపై పలు అనుమానాలు కలిగాయి. అసలు హేమ లేదు కావచ్చు అని కూడా కొందరు అనుకున్నారు. అంటే ఆమె అంత గొప్పగా మ్యానేజ్ చేసింది. కానీ ఎన్ని వేశాలు వేసినా నిజం అనేది దాగదు కదా.. బెంగళూర్ పోలీసులు హేమ బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అని పరీక్ష చేయగా, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది.

దీంతో సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. సూపర్‌గా నటించావు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. ఇక డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై హేమ స్పందించింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేదే లేదు.. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా అంటూ ఆమె ఫైర్ అయ్యిందంట. అంతే కాకుండా ఈమె బెగళూర్ పోలీసుల వద్ద కూడా హైడ్రామా ప్లే చేసినట్లు తెలుస్తోంది. తన పేరు కృష్ణవేణిగా ఆమె చెప్పుకొచ్చిందంట. టీవీలో న్యూస్ తర్వాత ఆమెను నటిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ రేవ్ పార్టీ కేసులో నటి హేమ, ఆషీరాయ్, హేమ స్నేహితుడు చిరంజీవి, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

Similar News