‘RRR’,‘Pushpa’లతో ఏ ప్రయోజనం లేదు.. Bollywood నటుడు షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’లను ఉద్ధేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2023-09-27 12:17 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’లను ఉద్ధేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన నేటి తరం కథలు, ప్రేక్షకుల అభిరుచుల గురించి మాట్లాడాడు. ‘‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను నేను ఇంకా చూడలేదు. అలాంటి చిత్రాలు చూడటం వల్ల థ్రిల్ తప్పా ఇంకేమీ ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. ఇందులో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించారు. పురుషుల ఆత్మన్యూన్యతా భావం ఎక్కువైన కారణంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే చిత్రాలు ఎక్కువైపోయాయి. అమెరికాలోని మార్వెల్ యూనివర్స్ తరహా పద్ధతే భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన చిత్రాల్లో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చాలా బాగుంది. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి ఎజెండా లేకుండా సినిమాను తెరకెక్కించే తీరు అద్భుతంగా ఉంటుంది’ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి :  

Chiranjeevi ఇంట్లో Bala Krishna సినిమా షూటింగ్

సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్! 

Tags:    

Similar News