'గజిని పార్ట్ 2'కు సిద్ధమవుతున్న సూర్య..

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'గజిని' సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 2005లో విడుదలైన ఈ మూవీ దాదాపు 11 ఏళ్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Update: 2022-10-09 13:08 GMT

దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'గజిని' సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 2005లో విడుదలైన ఈ మూవీ దాదాపు 17 ఏళ్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం మళ్లీ పార్ట్ 2గా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సెకండ్ పార్ట్‌లో కూడా మొత్తం ఓల్డ్ కాంబినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువనుందని చర్చ నడుస్తోంది. 

ALSO READ : సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్!

Tags:    

Similar News