బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఈ ఏడాదిలోనే సినిమా?

ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తూ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు.

Update: 2024-05-23 12:42 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తూ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు. తాజాగా, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదిలోనే జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కథను ఎంచుకునే పనిలో పడ్డాడని టాక్. స్టోరీ ఫైనల్ అవ్వగానే వెంటనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం బయటకు రావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్, ఏ హీరోయిన్‌తో చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో మొదలెట్టారు నెటిజన్లు. అయితే బాలయ్యకు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం బాలయ్య వారసుడు సినీ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Similar News