విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన వార్త
ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మరో స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందంటూ ఓ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందంటూ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు పోస్ట్ పెట్టడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విద్యాబాలన్ తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో అది చూసిన వారంతా నిజంగానే విడాకులు తీసుకుంటుందా? అని షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఉమైర్ సంధుని తిట్టిపోస్తున్నారు.