విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి ఆమె నా జీవితమంటూ ఎమోషనల్ పోస్ట్

ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది.

Update: 2024-05-10 02:14 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. అయితే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నప్పటికీ డైవర్స్ తీసుకుని నీ దారి నీది.. నా దారి నాది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విడాకులు తీసుకుని విడిపోతూ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. పెళ్లైన రెండు, మూడేళ్లకే భాగస్వామితో విడిపోతున్నారు. తాజాగా, ఓ స్టార్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది.

ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మలయాళ స్టార్ హీరోయిన్ భామ 2020లో జగదీశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమా దూరమైంది. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత కొద్ది కాలంగా భామ విడాకుల వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా ఆమెనే అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

తన కూతురు తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ‘‘ నేను ఇంత స్ట్రాంగ్‌ అని నాకు ఇంతవరకూ తెలియలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసింది. ఇప్పుడు దృఢంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు.. ప్రస్తుతం ఇదే మా ఇద్దరి జీవితం’’ అంటూ రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు స్ట్రాంగ్‌గా ఉండమని సలహా ఇస్తున్నారు.

Full View


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News