రకుల్ కి 3 కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చిన స్టార్ హీరో.. కోపంతో అలా చేసిన రకుల్ తండ్రి..

‘వెంకటాద్రి ఎక్స్‌ఫ్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రకూల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితమే.

Update: 2024-05-23 03:36 GMT

దిశ, సినిమా: ‘వెంకటాద్రి ఎక్స్‌ఫ్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రకూల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అనతికాలంలోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్ళి చేసుకొని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ముదుగుమ్మకు సంబంధించిన ఒకప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ఇబ్బంది పడి జీరో నుండి ప్రస్తుతం కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. అలా తనకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు పెరగడంతో హైదరాబాదులో ఉండడం కోసం ఆమె దాదాపు 3 కోట్ల ఖరీదు చేసే ఒక లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన సమయంలో చాలామంది ఇండస్ట్రీ జనాలు రకుల్ ప్రీత్ సింగ్ కి ఓ తెలుగు స్టార్ హీరో ఆ ఫ్లాట్ కొనిచ్చాడు అంటూ ఒక రూమర్ క్రియేట్ చేశారు.

ఆ రూమర్ కాస్త రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి వరకు వెళ్ళింది. దాంతో వెంటనే రకుల్ తండ్రి ఆమె మేనేజర్ కి ఫోన్ చేసి నా బిడ్డ కష్టపడి రూపాయి రూపాయి వెనకేసుకొని తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కుంటే వాడెవడో కొనిచ్చాడని అంటున్నారు. అసలు ఆ రూమర్స్ ఏంటి వినడానికే అసహ్యంగా ఉన్నాయి అంటూ మేనేజర్ పై రకుల్ తండ్రి అరిచాడట. ఇక ఈ విషయం తెలిసిన రకుల్ వెంటనే ఫోన్ లాక్కుని నాన్న సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. అలాంటి వాటికి మనం రియాక్ట్ అవ్వకూడదు అంటూ సర్ది చెప్పిందట. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Similar News