'జబర్దస్త్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: గ్లామర్‌లో అనసూయ, రష్మీని మించిపోయిన కొత్త యాంకర్

ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇటీవల జబర్దస్త్‌లో ఎన్నో సంఘటనలు జరిగాయి.

Update: 2022-11-05 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇటీవల జబర్దస్త్‌లో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒక్కొక్కరిగా చాలామంది జబర్దస్త్‌ను వీడటం జరిగింది. ఈ క్రమంలోనే యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కూడా సినిమాలతో బిజీ అయిపోయి జబర్దస్త్‌‌ను వీడింది. ఇక అప్పుడు జబర్దస్త్‌‌కి కొత్త యాంకర్‌ను తీసుకొస్తారు అంటూ ప్రచారాలు జోరుగా సాగాయి. కానీ, ఎక్స్‌స్ట్రా జబర్దస్త్‌‌లో యాంకర్‌గా సాగే రష్మీనే జబర్దస్త్‌‌కు కూడా యాంకర్‌గా చేసింది.

ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో రష్మీ ఇక జబర్దస్త్‌‌లో కనిపించలేదు. దానికి కారణం కొత్త యాంకర్ రావడమే అంటూ.. లెటెస్ట్ ఫ్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక జబర్దస్త్‌‌కి కొత్తగా వచ్చిన యాంకర్ పేరు సౌమ్య. అందంలో అనసూయ, రష్మీని మించి స్లిమ్ బాడీతో సూపర్ గ్లామరస్‌గా ఉంది. రావడం మొదలు పంచులు కూడా బాగానే వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ''ఇంత అందమైన యాంకర్‌ను ఎక్కడ నుండి పట్టారు. సెలక్షన్ సూపర్ అంటూ'' నెటిజన్స్ కామెంట్లలతో హోరెత్తిస్తున్నారు.


Tags:    

Similar News