'భజరంగీ' మూవీ నటిని దారుణంగా హత్య చేసిన భర్త..

బ్లాక్‌ బాస్టర్‌ మువీ ‘భజరంగీ’ నటి, కాంగ్రెస్‌ నేత విద్య (36) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు.

Update: 2024-05-23 09:26 GMT

దిశ, సినిమా: బ్లాక్‌ బాస్టర్‌ మువీ ‘భజరంగీ’ నటి, కాంగ్రెస్‌ నేత విద్య (36) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మైసూర్‌లోని తన ఇంట్లో జరిగింది. హత్య అనంతరం ఆమె భర్త నందీష్ పరార్‌ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కాగా నటి విద్య, నందీష్‌ని 2018లో వివాహం చేసుకుంది. వివాహనంతరం కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ ఈ జంట గొడవపడుతుండేది. దీంతో విద్య భర్త నందీష్‌ విడాకులు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ అతని తల్లిదండ్రులు తెలివిగా వ్యవహరించి వారిద్దరికీ రాజీ కుదిర్చారు. అయినా వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. తాజాగా వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో భర్త నందీష్ విద్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నందీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుడు నందీష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News