కాబోయే వాడికి పక్కా అవి ఉండాల్సిందేనని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్ అందరికీ సుపరిచితమే. కానీ ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

Update: 2024-05-12 04:03 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్ అందరికీ సుపరిచితమే. కానీ ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు మాత్రం అనుకున్నంత రేంజ్‌లో దక్కించుకోలేకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ అందుకుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తో మరోసారి తెలుగులో సీత పాత్రలో అడియన్స్ ముందుకు వచ్చి అద్భుతమైన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అతడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాలను వివరించింది. 'నాకు కోరికలు చాలా తక్కువ. ఇది కావాలి.. అది కావాలని అడగను. ఎందుకంటే ఇలాంటి కోరికలు ఉంటే మనం చాలా ఒత్తిడికి లోనవుతాము. మనకు ఏం కావాలి అని అనుకుంటామో దానికి అపోజిట్‌లో మనకు దొరుకుతుంది.

నాకు అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటాను. కానీ వాస్తవంలో అది నెరవేరక పోవచ్చు. కాబట్టి నేను చేసుకోబోయే వాడు సింప్లిసిటీగా, నిజాయితీ ఉండాలి. అలాగే నన్ను హ్యాపీ గా ఉంచాలి.. నేను వర్క్ చేసే వారితో గంటల తరబడి మాట్లాడతాను అతను ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. నా మైండ్ సెట్ తన మైండ్ సెట్ ఒకేలా ఉండాలని నేను కోరుకోను కానీ ఎల్లప్పుడు నన్ను సురక్షితంగా చూసుకోవాలి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Similar News