ప్రభాస్ గురించి షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్.. మీద నుంచి బస్సు పోవడంతో

ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సహ నటిగా నటించిన సంజన గల్రాని అందరికీ సుపరిచితమే.

Update: 2024-05-23 06:51 GMT

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సహ నటిగా నటించిన సంజన గల్రాని అందరికీ సుపరిచితమే. ఈమె సోగ్గాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో కూడా నటించింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలిపింది.. అందులో భాగంగా "ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ టైం లో నేను స్పాట్లో లేను కానీ అది విన్న వెంటనే నేను సెట్ లోని వాళ్ళందరము ఎక్కడ పని అక్కడ ఆపేసి పరిగెత్తుకుంటూ ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ఏదో టేక్ సమయంలో ప్రభాస్ కింద పడ్డాడు. అప్పుడు ఒక బస్ అయిన మీద నుంచి వెళ్ళింది" అంటూ ప్రభాస్ కి అయిన యాక్సిడెంట్ గురించి చెప్పారు సంజన. సాధారణంగా "బస్ మనకి తగలక పోయినప్పటికీ మన చాలా క్లోజ్‌గా ఒక బస్ వెళితే ఎంత కంగారు పడతాం. అలాంటిది ప్రభాస్ గారు ఏ మాత్రం కంగారు పడకుండా అలాగే ఎవరినీ కంగారు పెట్టకుండా అందరూ వచ్చి అడుగుతున్నా కూడా బాగానే ఉన్నాను అంటూ చాలా కూల్ గా ఉన్నారు. ఆయన నిజంగా ఒక రియల్ లైఫ్ హీరో" అని అన్నారు సంజన.


"చాలామంది హీరోలకి ఇలా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ లు అవుతాయి. చాలామంది హీరోలు ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు చేస్తూ దెబ్బలు తిని సర్జరీలు కూడా చేయించుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు ప్రభాస్ గారికి ఏమీ కాలేదు" అని చెప్పుకొచ్చారు సంజన.

Similar News