అమ్మాయిలు ఎలాంటి కండోమ్‌లు వాడాలో చెప్పిన హీరోయిన్.. బాధను వదిలి ఆనందాన్ని ఇచ్చేది కొనుకోండి(వీడియో)

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే పలు సినిమాలు చేసి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తుంది. అలాగే వివాదాలకు కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సమస్యలు ఎదర్కొంది.

Update: 2024-05-22 11:48 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే పలు సినిమాలు చేసి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తుంది. అలాగే వివాదాలకు కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సమస్యలు ఎదర్కొంది. పలు కామెంట్స్‌తో ట్రోల్స్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తనకు అనిపించింది చెబుతుంది. రాధిక తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’ అనే సినిమాలో నటించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాక బాలీవుడ్‌కు చెక్కేసింది. ఓ వైపు సినిమాలు, వెబ్ సీరిస్ చేస్తూనే పలు యాడ్స్ చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాధికా ఆప్టే అమ్మాయిలకు ఎలాంటి కాండోమ్ కొనుక్కోవాలో చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఓ యాడ్‌కు సంబంధించినదని తెలుస్తోంది. ఇందులో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. కండోమ్స్ సమాజంలో ఈ పేరు పలకడం నిషేధం.. ఎందుకు? కండోమ్స్ ఎప్పుడు మన పార్ట్‌నర్స్ ఛాయిస్‌కు వదిలేస్తున్నాం ఎందుకు? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదా? మన సుఖం వదిలి బాధను భరిస్తూ కండోమ్స్‌ను ఎందుకు భరించాలి. కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు. ఏ కండోమ్స్ మనకు ఆనందాన్ని, కంఫర్ట్‌ను ఇస్తుందో అదే  ఎపిక్ కండోమ్స్‌ను వాడండి. ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి అమ్మాయిలు మీ కండోమ్ మీరే కొనుక్కోండి’’ అని చెప్పుకొచ్చింది.

Similar News