ఆయన నిజస్వరూపం బయటకు రావాలి..దర్శకుడి కాల్ రికార్డ్స్‌తో సంచలనంగా మారిన హీరోయిన్!
చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్ అంటుంటారు. అంతే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట్లో
దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్ అంటుంటారు. అంతే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అది ఏంటీ అనుకుంటున్నారా? ఓ దర్శకుడి నిర్వాకం తెలిసిన నటి ఆ డైరెక్టర్‌ను ఇన్ డైరెక్టర్‌గా ఆట ఆడేసుకుంటుందంట. అంతేకాకుండా ఆయన ఆ హీరోయిన్ అంటే చాలు ఆమడ దూరం పారిపోతాడంట. ఇంతకీ ఆ దర్శకుడు నటికి భయపడడానికి గల అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ హీరోయిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాలు చేస్తూ పోయింది. కానీ అప్పుడే ఊహించని పరిణామం ఎదురైంది.. అనుకోకుండా ఆమెకు సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె చాలా రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. కానీ ఓ డైరెక్టర్‌ను మాత్రం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటుంది. అంతే కాకుండా ఆమె నార్మల్‌గా పోస్టులు పెట్టిన అవి ఆ దర్శకుడి కోసమే అనుకుంటారు కొందరు. ఎందుకంటే ఆ నటికి దర్శకుడికి అంతలా పడదు. తన జీవితం నాశనం చేసి, సినీ కెరీర్ ముగిసే విధంగా చేసింది ఆ దర్శకుడేనంట. ఆమె చాలా మంది దగ్గర ఆ దర్శకుడి నిజస్వరూపం బయటకు రావాలి, అతను కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తుందంట. కానీ ఆ దర్శకుడికి ప్రతి విషయం తెలిసినా ఆయన ఏం తెలియనట్లు చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఆమె ఏం చేసినా ఎలాంటి రిప్లై ఇవ్వరు.
అయితే అలా ఆయన నిశ్శబ్ధం ఉండటానికి కూడా ఓ పెద్ద కారణమే ఉన్నదంట. అది ఏమిటంటే? ఆ దర్శకుడు, ఈ హీరోయిన్ తో మాట్లాడిన కాల్ రికార్డులు కొన్ని ఆమె దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మాట్లాడిన మాటలు, ఇచ్చిన కొన్ని ప్రత్యేక సలహాలు, అంతే కాకుండా కమిట్ మెంట్‌కు సంబంధించిన ముచ్చట్లు ఇలా చాలా విషయాలు ఆమె వద్ద కాల్ రికార్డ్స్ రూపంలో ఉన్నాయంట. అందుకే ఆ నటి అంటే డైరెక్టర్‌కు చాలా భయం అని ఇండస్ట్రీలో టాక్. అందుకే ఆమె ఎన్ని సార్లు సోషల్ మీడియా సాక్షిగా కామెంట్ లు చేసినా, అటు నుంచి నేరుగా కానీ, పరోక్షంగా కానీ స్పందన ఉండదంట.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. అందుకే దర్శకుడు ఇంత సైలెంట్‌గా ఉంటున్నాడా అంటూ ముచ్చటిస్తున్నారు నెటిజన్స్!