అభిమాని మృతి.. ప్రభాస్ చేసిన పనికి అందరూ షాక్ అవ్వాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

Update: 2024-05-26 05:03 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 ad జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుండగా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈ మూవీలో దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కల్కి ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా తన సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు కేటాయించడం మనం చూస్తుంటాం. అప్పుడు కోవిడ్ సంక్షోభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభాస్ భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారనే విషయం తెలిసినదే. ఇటీవల తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కి రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన తోటి నటులకు అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారని ప్రభాస్ తో పని చేసిన నటులు, హీరోయిన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఇటీవల మరణించారు. అతని మృతి వార్త తెలుసుకున్న ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించమని పీఏ రామకృష్ణను శనివారం రమేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపారు. అలాగే ఆయన పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా… ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ అభిమాని కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించారని కొనియాడుతున్నారు.

Similar News