అద్దె కూడా దొరకలేదు.. రెండేళ్ల బాబుతో రోడ్డు మీద ఏడ్చేశానంటూ నటి ఎమోషనల్ కామెంట్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు. తిలోత్తమ క్యారెక్టర్‌తో ఈమె ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్, కామెడీ సీన్స్‌లలో నటించి

Update: 2024-05-23 10:24 GMT

దిశ, సినిమా : క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు. తిలోత్తమ క్యారెక్టర్‌తో ఈమె ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్, కామెడీ సీన్స్‌లలో నటించి తన నటనతో పత్రి ఒక్కరి హృదయాలలో చోటు సంపాదించుకుంది..

పెళ్లాం ఊరెళితే, ఎవడిగోల వాడితే. దరువు, యముడికి మొగుడు ఇలా చాలా సినిమాల్లో ఈమె నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. చిత్ర పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతూ కన్నీరు పెట్టుకుంది. జ్యోతి మాట్లాడుతూ.. వ్యాంప్ పాత్రలు చేసేవారిని చాలా చులకనగా చూస్తారు. నేను అలాంటి సిట్యూవేషన్స్ ఎదుర్కొన్నాను. నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉన్నదా అంటే.. శృంగార పరమైన పరోపణలు ఎదుర్కోవడం. ఆ సమయంలో నేను ఉన్న అద్దె ఇంటి నుంచి నన్ను ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారు. రెండేళ్ల నా కొడుకుని ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగా. నాకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనితో నా కొడుకుని ఎత్తుకుని నడి రోడ్డులో ఏడ్చానంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో కూడా నన్ను చాలా చులకనగా చూసేవారు, ఆ ఆరోపణల తర్వాత నా స్నేహితులు కూడా దూరం అయ్యారు. ఎవరూ నాకు సహకరించలేదు. చాలా ఒంటరిని అయిపోయాను. ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది. కానీ నేను తప్పు చేసి ఉంటే ఒకే.. ఏ తప్పు చేయకున్నా ఆరోపణలు వచ్చినందుకే వాళ్లు నన్ను అలా చేయడం బాధేసిందని తెలిపింది.

Similar News