రమ్యకృష్ణని గాఢంగా ప్రేమించిన ఆ స్టార్ హీరో.. కానీ చివరికి యాక్సిడెంట్‌లో అలా

అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2024-05-25 05:17 GMT

దిశ, సినిమా: అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రలో నటించాలంటే రమ్యకృష్ణకు సాటి ఎవ్వరు లేరు. తన ఆవేశం, ఉక్రోశాన్ని చూపిస్తూ..ఆమె నటన తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘బాహుబలి’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‌కు తల్లిగా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక అప్పటినుంచి మదర్ క్యారక్టర్‌కు కెరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్ గా చేసింది. అలా ఈమె కోలీవుడ్ లో నటించిన సమయంలో ఓ స్టార్ హీరో రమ్యకృష్ణ అందానికి ముగ్ధుడై ఆమెతో ప్రేమలో పడ్డాడట. అయితే రమ్యకృష్ణకి ఈ విషయం తెలియక పోయినప్పటికీ ఆ హీరో మాత్రం వన్ సైడ్ లవ్ చేశారు. అంతేకాదు ఈ హీరో రమ్యకృష్ణతో కొన్ని సినిమాల్లో కూడా చేశారట.

కానీ చివరికి రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీతో ప్రేమలో పడి ఆయన్నే పెళ్లి చేసుకుంది. ఇక చివరికి కృష్ణవంశీ దర్శకత్వంలో ఆ హీరో రమ్యకృష్ణతో ఓ సినిమా చేసే సమయంలో రమ్యకృష్ణ కి కృష్ణవంశీకి మధ్య ఉన్న ప్రేమాయణం ఆయనకు తెలిసిపోవడంతో తన ప్రేమ విషయం బయట పెట్టకుండా లోలోపల ఎంతగానో కుమిలీపోయారట. అయితే రమ్య కృష్ణ పెళ్లి అయిన సమయంలో కూడా ఆ హీరో చాలా డిప్రెషన్ లోకి వెళ్లారట. కానీ చివరికి చేసేదేమీ లేక ఆయన కూడా పెళ్లి చేసుకున్నారట. ఇక పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక ఈ హీరో ఓ యాక్సిడెంట్లో మరణించారు.

Similar News